యాక్షన్‌, ఎమోషన్‌ అందరినీ మెప్పిస్తాయి

ABN , Publish Date - May 28 , 2024 | 03:39 AM

తెలుగులో చేసిన తొలి సినిమా ‘స్పై’తో అందరినీ మెప్పించిన ఐశ్వర్య మీనన్‌ లేటెస్ట్‌ చిత్రం ‘భజే వాయు వేగం’. కార్తీకేయ గుమ్మడికొండ కథానాయకుడిగా నటించగా, ప్రశాంత్‌ రెడ్డి ఈ ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను...

యాక్షన్‌, ఎమోషన్‌ అందరినీ మెప్పిస్తాయి

తెలుగులో చేసిన తొలి సినిమా ‘స్పై’తో అందరినీ మెప్పించిన ఐశ్వర్య మీనన్‌ లేటెస్ట్‌ చిత్రం ‘భజే వాయు వేగం’. కార్తీకేయ గుమ్మడికొండ కథానాయకుడిగా నటించగా, ప్రశాంత్‌ రెడ్డి ఈ ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మించారు. ఈ నెల 31న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా హీరోయిన్‌ ఐశ్వర్య మీడియాతో చిత్ర విశేషాలను ముచ్చటించారు. ‘‘ఇందులో నేను ఇందు అనే పాత్రలో కనిపిస్తాను. ఇది కమర్షియల్‌ సినిమా అయినా నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమా రా కంటెంట్‌తో నడుస్తుంది. ఒక కామన్‌ మ్యాన్‌ అసాధారణ సమస్యలో ఇరుక్కుంటే అందులో నుంచి ఎలా బయటపడ్డాడనే కథాంశాన్ని తెరపైన చూసే ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా దర్శకుడు సినిమాను మలిచారు. ఇందులోని యాక్షన్‌, ఎమోషన్‌ అందరినీ మెప్పిస్తాయి. నటిగా నాకు అన్ని రకాల పాత్రల్లోనూ నటించాలని ఉంది. కార్తీకేయతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ బాగుంది. దర్శకుడు ప్రశాంత్‌ సినిమా మేకింగ్‌పై మంచి క్లారిటీతో ఉంటాడు. ఆయన దర్శకత్వశైలిని, ప్రతిభను మీరు థియేటర్స్‌లో చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతారు’’ అని చెప్పారు.

Updated Date - May 28 , 2024 | 03:39 AM