రావణుడిగా నటిస్తున్నా

ABN , Publish Date - Oct 23 , 2024 | 02:15 AM

కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ హిందీ ‘రాయాయణ్‌’లో రావణుడి పాత్రను పోషిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇందులో రాముడి పాత్రను రణ్‌బీర్‌ కపూర్‌, సీత పాత్రను సాయిపల్లవి చేస్తున్నారని తెలిపారు...

కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ హిందీ ‘రాయాయణ్‌’లో రావణుడి పాత్రను పోషిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇందులో రాముడి పాత్రను రణ్‌బీర్‌ కపూర్‌, సీత పాత్రను సాయిపల్లవి చేస్తున్నారని తెలిపారు. నితిశ్‌ తివారీ భారీ స్థాయిలో రూపొందిస్తున్న ‘రామాయణ్‌’ నిర్మాణంలో తను కూడా ఉన్నాననీ, అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను తీయాలనుకుంటున్నట్లు యశ్‌ వెల్లడించారు. ‘ద హాలీవుడ్‌ రిపోర్టర్‌ ఇండియా’ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ‘రామాయణ్‌’ చిత్రానికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించారు. ‘లాస్‌ ఏంజెల్స్‌లో టాక్సీక్‌ చిత్రం వీఫెక్స్‌ వర్క్‌ కోసం ఉన్నప్పుడు డీఎన్‌ఈజీ విఫెక్స్‌ కంఎనీ అధినేత నమిత్‌ మల్హోత్రా నన్ను కలిసి ‘రామాయణ్‌’ చిత్రం గురించి చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాజెక్ట్‌ మీద వర్క్‌ చేస్తున్నట్లు తెలిపారు. అప్పుడే రావణుడి పాత్ర చేయమని నన్ను అడిగారు.


ఆ పాత్రను పాత్రగానే తీస్తే నేను తప్పకుండా నటిస్తానని చెప్పా. ఆ తర్వాత నితీశ్‌ తివారీని కలిశా. ఆయనతో మాట్లాడిన తర్వాత నేను కూడా నిర్మాణంలో భాగస్వామినయ్యా. రణ్‌బీర్‌ ను రాముడిగా అనుకున్నారు. సీతగా సాయిపల్లవిని తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పగానే మంచి సెలెక్షన్‌ అని చెప్పా’ అన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 02:15 AM