ట్రెండ్‌కు అనుగుణంగా..

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:53 AM

‘హను-మాన్‌’ చిత్రంతో ఈ ఏడాది ప్రారంభంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించిన చిత్ర నిర్మాణ సంస్థ ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇప్పుడు ప్రియదర్శి, నభా నటేశ్‌ జంటగా నిర్మిస్తున్న ‘డార్లింగ్‌’ చిత్రం జులై19న...

ట్రెండ్‌కు అనుగుణంగా..

‘హను-మాన్‌’ చిత్రంతో ఈ ఏడాది ప్రారంభంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించిన చిత్ర నిర్మాణ సంస్థ ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇప్పుడు ప్రియదర్శి, నభా నటేశ్‌ జంటగా నిర్మిస్తున్న ‘డార్లింగ్‌’ చిత్రం జులై19న విడుదల కానుంది. అశ్విన్‌రామ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. రోమ్‌ కామ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాతో మరోసారి హిట్‌ సాధిస్తామని నిర్మాతలు నిరంజన్‌రెడ్డి, చైతన్య చెబుతున్నారు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణమైన అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించడానికి ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, ఫస్ట్‌ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. బ్రహ్మనందం, విష్ణు, కృష్ణతేజ్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నరేశ్‌ రామదురై సినిమాటోగ్రాఫర్‌. హేమంత్‌ సంభాషణలు రాశారు.

Updated Date - Jun 25 , 2024 | 12:53 AM