విలన్‌గా అభిషేక్‌ బచ్చన్‌

ABN , Publish Date - Jul 17 , 2024 | 06:28 AM

బాలీవుడ్‌లో ఒక్కో హీరో ఇప్పుడు విలన్‌గా మారుతున్నాడు. సంజయ్‌దత్‌, సైఫ్‌ అలీఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, బాబీ డియోల్‌... ఇలా . తాజాగా ఈ జాబితాలోకి అభిషేక్‌ బచ్చన్‌ చేరబోతున్నారు...

బాలీవుడ్‌లో ఒక్కో హీరో ఇప్పుడు విలన్‌గా మారుతున్నాడు. సంజయ్‌దత్‌, సైఫ్‌ అలీఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, బాబీ డియోల్‌... ఇలా . తాజాగా ఈ జాబితాలోకి అభిషేక్‌ బచ్చన్‌ చేరబోతున్నారు. షారుఖ్‌ఖాన్‌ కొత్త చిత్రం ‘కింగ్‌’లో అభిషేక్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ విషయాన్ని అయన తండ్రి అమితాబ్‌ స్వయంగా వెల్లడించడం విశేషం. ‘ఇదే సమయం’ అంటూ తనయుడు అభిషేక్‌కు అభినందనలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు అమితాబ్‌. గత ఏడాది ‘జవాన్‌’, ‘పఠాన్‌’ చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ ఇచ్చిన షారుఖ్‌ ఖాన్‌ ఇప్పుడు ‘కింగ్‌’ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఆయన కుమార్తె సుహానా ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ‘కింగ్‌’ చిత్రానికి సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - Jul 17 , 2024 | 06:28 AM