అభినవ్‌ హీరోగానూ సక్సెస్‌ కావాలి

ABN , Publish Date - Feb 22 , 2024 | 05:39 AM

అభినవ్‌ గోమఠం హీరోగా నటించిన ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా’ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్‌ ఈఎంట్‌కు హీరో వరుణ్‌తేజ్‌ ముఖ్య అతిధిగా హాజరై...

అభినవ్‌ హీరోగానూ సక్సెస్‌ కావాలి

అభినవ్‌ గోమఠం హీరోగా నటించిన ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా’ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్‌ ఈఎంట్‌కు హీరో వరుణ్‌తేజ్‌ ముఖ్య అతిధిగా హాజరై బిగ్‌ టికెట్‌ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అభినవ్‌ తొలిసారిగా హీరోగా నటిస్తున్నాడు. చిత్రంలో అన్ని భావోద్వేగాలు ఉన్నాయని తెలిసింది. కంటెంట్‌ను నమ్మి తీసిన సినిమాలా అనిపించింది. ఈ చిత్రం విజయం సాధించాలి’ అని అన్నారు. ‘నా కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఈ సినిమాలో నటించడం లక్కీగా ఫీలవుతున్నాను. నా సినిమా కంటెంట్‌ నచ్చితే ప్రోత్సహించండి.’ అన్నారు అభినవ్‌. దర్శకుడు తిరుపతిరావు మాట్లాడుతూ ‘దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన అభినవ్‌కు, నిర్మాతలకు రుణపడి ఉంటాను. అందరి సహకారంతో చిత్రాన్ని పూర్తి చేశాను. తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన భవాని కాసుల మాట్లాడుతూ ‘సినిమాలోని ప్రతి పాత్ర అందరికీ రిలేటెడ్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయి. సినిమా విజయం మీద నమ్మకం ఉంది’ అన్నారు. వైశాలి రాజ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌ వి నిర్మించారు.

Updated Date - Feb 22 , 2024 | 05:39 AM