అభి, మహీ మళ్లీ కలిశారు!

ABN , Publish Date - Mar 05 , 2024 | 02:36 AM

మన్మథుడు సినిమాలో కలసి నటించిన నాగార్జున, అన్షు అంబానీ మళ్లీ కలిశారు. ఆ చిత్రంలో తన అందంతో అభి మనసునే కాదు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు అన్షు. ‘మన్మథుడు’ చిత్రం తర్వాత ప్రభాస్‌ సరసన...

అభి, మహీ మళ్లీ కలిశారు!

మన్మథుడు సినిమాలో కలసి నటించిన నాగార్జున, అన్షు అంబానీ మళ్లీ కలిశారు. ఆ చిత్రంలో తన అందంతో అభి మనసునే కాదు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు అన్షు. ‘మన్మథుడు’ చిత్రం తర్వాత ప్రభాస్‌ సరసన ‘రాఘవేంద్ర’ సినిమాలో కూడా నటించి ఆ తర్వాత తెర మరుగయ్యారు. సచిన్‌ సాగర్‌ అనే బిజినెస్‌ మ్యాన్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు శాశ్వతంగా గుడ్‌ బై చెప్పేశారు. అప్పుడు అలా మాయమైన అన్షు మళ్లీ ఇప్పుడు హఠాత్తుగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమైంది. స్నేహితులను కలసుకోవడానికి వచ్చిన అన్షు అనుకోకుండా ఓ పార్టీలో నాగార్జునని కలసింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని అన్షు అంబానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. బ్లాక్‌ డ్రెస్‌లో ఉన్న ఇద్దరి ప్రస్తుత ఫొటోను, మన్మఽథుడు సినిమాలోని ఫొటోను అన్షు షేర్‌ చేసింది. ‘‘22 ఏళ్ల తర్వాత నా కో-స్టార్‌ నాగార్జునను కలుసుకోవడం ఎంతో సర్‌ప్రైజింగ్‌గా ఉంది. మన్మథుడు సినిమా సెట్‌లో ఎంత హుషారుగా ఉన్నారో ఇప్పటికీ అంతే హుషారుగా ఆయన ఉన్నారు. ఈ మూమెంట్‌ ఎంతో ప్రత్యేకమైనది’’ అని పోస్ట్‌లో పేర్కొంది.

Updated Date - Mar 05 , 2024 | 02:36 AM