ఓ యువకుడి న్యాయపోరాటం

ABN , Publish Date - Sep 01 , 2024 | 05:27 AM

ప్రియదర్శి కొత్త చిత్రం మొదలైంది. హీరో నాని సమర్పణలో వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై తయారయ్యే ఈ చిత్రానికి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత...

ప్రియదర్శి కొత్త చిత్రం మొదలైంది. హీరో నాని సమర్పణలో వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై తయారయ్యే ఈ చిత్రానికి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. రామ్‌ జగదీశ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రియదర్శిపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నాని తొలి క్లాప్‌ ఇచ్చారు. అన్యాయంగా ఒక కేసులో ఇరికించిన ఓ కుర్రాడి కోసం జరిగే న్యాయపోరాటం ఈ చిత్రకథ అని దర్శకుడు చెప్పారు. శివాజీ, సాయికుమార్‌, రోహిణి, హర్షవర్ధన్‌, రశ్రీదేవి ఇతర ముఖ్యతారాగణం.

Updated Date - Sep 01 , 2024 | 05:27 AM