వారం రోజుల ముందుగానే..

ABN, Publish Date - Jul 19 , 2024 | 02:00 AM

రక్షిత్‌ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు వెంకట్‌ సత్య రూపొందించారు....

రక్షిత్‌ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు వెంకట్‌ సత్య రూపొందించారు. తెలుగు, తమిళ భాషల్లో తయారైన ఈ సినిమాలో సంగీర్తన కథానాయిక. ముందు అనుకున్నట్లు కాకుండా వారం రోజుల ముందుగానే అంటే ఈ నెల 26న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ధ్యాన్‌ అట్లూరి చెప్పారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. రాధిక శరత్‌కుమార్‌ ఓ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో చరణ్‌రాజ్‌, విద్యాసాగర్‌, రాకెట్‌ రాఘవ, రఘు కుంచె ఇతర ముఖ్య తారాగణం.

Updated Date - Jul 19 , 2024 | 02:00 AM