ఒక యోధుడి ప్రేమకథ

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:49 AM

సిద్ధార్థ్‌ మల్హోత్రా, రాశీఖన్నా జంటగా నటించిన హిందీ చిత్రం ‘యోధ’. దిశాపటానీ కీలకపాత్ర పోషించారు. దర్శక ద్వయం సాగర్‌ ఆంబ్రే, పుష్కర్‌ ఓజా దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో...

ఒక యోధుడి ప్రేమకథ

సిద్ధార్థ్‌ మల్హోత్రా, రాశీఖన్నా జంటగా నటించిన హిందీ చిత్రం ‘యోధ’. దిశాపటానీ కీలకపాత్ర పోషించారు. దర్శక ద్వయం సాగర్‌ ఆంబ్రే, పుష్కర్‌ ఓజా దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే యూనిట్‌ ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని విడుదల చేసి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘యోధ’ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం సిద్ధార్థ్‌ మల్హోత్రా, రాశీ ఖన్నా తెలుగు మీడియాతో ముచ్చటించారు. సిద్ధార్థ్‌ మాట్లాడుతూ ‘‘యోధ’ యువతలో దేశ భక్తిని, ధైర్యాన్ని పెంపొందించే ఆసక్తికర కథతో తెరకెక్కింది. ఈ సినిమాలో భాగమవ్వడమే ఒక అసాధారణ ప్రయాణం. ప్రేక్షకులను ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుంది’ అన్నారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ ‘‘యోధ’లో పనిచేయడం ఒక ఉత్తేజకర అనుభవం. ధైర్యం, ప్రేమ కలబోతగా తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు.

Updated Date - Feb 27 , 2024 | 04:49 AM