ధర్మం కోసం పోరాడే యోధుడు
ABN, Publish Date - Oct 25 , 2024 | 02:32 AM
తమిళ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’. ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్‌ను శివ దర్శకత్వంలో కేఈ.జ్ఞానవేల్, వంశీ, ప్రమోద్ నిర్మించారు. నవంబర్ 14న దాదాపు పది భాషల్లో త్రీడీలో, 2డీలో...
తమిళ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’. ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్‌ను శివ దర్శకత్వంలో కేఈ.జ్ఞానవేల్, వంశీ, ప్రమోద్ నిర్మించారు. నవంబర్ 14న దాదాపు పది భాషల్లో త్రీడీలో, 2డీలో విడుదలవుతోన్న సందర్భంగా గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శివ మాట్లాడుతూ ‘‘దాదాపు వెయ్యేళ్ల క్రితం ఐదు తెగల మధ్య జరిగిన పోరాటమే ఈ సినిమా కథాంశం. సూర్యకు ఈ కథ చెప్పగానే విపరీతంగా నచ్చేసింది. సినిమా గొప్ప విజయం సాధిస్తుంది’’ అని చెప్పారు. ‘‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఎంతో ఆనందాన్నిస్తోంది. తను నమ్మిన ధర్మం కోసం పోరాడే యోధుడి కథ ఇది. టీమ్ ఎఫర్ట్ వల్లే సినిమా అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చింది’’ అని సూర్య చెప్పారు.