గుర్రం పై యోధుడు

ABN , Publish Date - Sep 19 , 2024 | 06:59 AM

కన్నడ కథానాయకుడు ఉపేంద్ర నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యూ ఐ ద మూవీ’. ఉపేంద్ర దర్శకత్వం వహిస్తున్న పదకొండో సినిమా ఇది. ఆయన కెరీర్‌లోనే...

కన్నడ కథానాయకుడు ఉపేంద్ర నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యూ ఐ ద మూవీ’. ఉపేంద్ర దర్శకత్వం వహిస్తున్న పదకొండో సినిమా ఇది. ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి కేపీ శ్రీకాంత్‌ నిర్మాత. నవీన్‌ మనోహరన్‌ సహ నిర్మాత. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్‌ విడుదల చేశారు. గుర్రం పై యోధుడి గెట్‌పలో ఉన్న ఆయన లుక్‌ అదిరింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు చెప్పారు. రీష్మా నాయక్‌, నిధి సుబ్బయ్య, మురళీశర్మ, రవిశంకర్‌ ఇతర ముఖ్య తారాగణం.

Updated Date - Sep 19 , 2024 | 06:59 AM