ఓటుకు రూ. ఐదువేలు

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:58 AM

సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’. ‘ఫర్‌ ఓట్‌’ అనేది ఉపశీర్షిక. వినయ్‌, అరుణ్‌, దీప్తివర్మ, ఆమని కీలకపాత్రలు పోషించారు. సూర్య దర్శకుడు...

ఓటుకు రూ. ఐదువేలు

సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’. ‘ఫర్‌ ఓట్‌’ అనేది ఉపశీర్షిక. వినయ్‌, అరుణ్‌, దీప్తివర్మ, ఆమని కీలకపాత్రలు పోషించారు. సూర్య దర్శకుడు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ట్రైలర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు పన్నే రాజకీయ నాయకుడిగా సాయికుమార్‌ కనిపించారు. తను పోటీ చేసే నియోజవర్గంలో ఒక్కో ఓటుకు రూ. 5వేలు చొప్పున మొత్తం రూ. 100 కోట్లు పంచేందుకు ఆయన ఎలాంటి ప్రయత్నం చేశారనేది ఆసక్తికరంగా అనిపించింది. యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వరరెడ్డి, వహీద్‌ షేక్‌, కే పేరుషోత్తం రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్‌ రుఫుస్‌. సినిమాటోగ్రఫీ: నని ఐనవెల్లి

Updated Date - Apr 21 , 2024 | 04:58 AM