దీవిలో తుపాన్‌

ABN , Publish Date - May 21 , 2024 | 06:12 AM

ఇటీవల విడుదలైన ‘లవ్‌గురు’ చిత్రంతో విజయాన్ని అందుకొన్న తమిళ హీరో విజయ్‌ ఆంటోనీ తాజా చిత్రం ‘తుపాన్‌’. విజయ్‌ ఆంటోనీతో ఇంతకుముందు ‘రాఘవన్‌’, ‘హత్య’...

దీవిలో తుపాన్‌

ఇటీవల విడుదలైన ‘లవ్‌గురు’ చిత్రంతో విజయాన్ని అందుకొన్న తమిళ హీరో విజయ్‌ ఆంటోనీ తాజా చిత్రం ‘తుపాన్‌’. విజయ్‌ ఆంటోనీతో ఇంతకుముందు ‘రాఘవన్‌’, ‘హత్య’ చిత్రాలను నిర్మించిన కమల్‌ బరా, డి.లలిత, బి. ప్రదీప్‌, పంకజ్‌ బోరా ఈ సినిమాకు నిర్మాతలు. పోయెటిక్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా దీనిని దర్శకుడు విజయ్‌ మిల్లర్‌ రూపొందిస్తున్నారు. ‘తనని చిన్నచూపు చూసే సమాజం భవితను మార్చేసిన వ్యక్తి కథ ఇది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. ఓ దీవి నేపథ్యంగా సాగే ఈ సినిమా షూటింగ్‌ అండమాన్‌, డయ్యూ, డామన్‌లో జరిపాం. ఈ నెల 29న టీజర్‌ విడుదల చేసి, త్వరలోనే ిచిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం’ అని నిర్మాతలు చెప్పారు. శరత్‌కుమార్‌, సత్యరాజ్‌, డాలీ ధనుంజయ, మేఘా ఆకాశ్‌, మురళీశర్మ, పృథ్వీ, శరణ్య తదితరులు చిత్రంలో నటిస్తున్నారు.

Updated Date - May 21 , 2024 | 06:12 AM