రెండున్నర గంటల ఎంటర్టైనర్
ABN , Publish Date - Mar 11 , 2024 | 03:29 AM
‘‘ప్రేక్షకులను రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేసే చిత్రం ‘వెయ్ దరువెయ్’. నిజ జీవిత సంఘటనల ఆధారంగా పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కించాను’’ అని దర్శకుడు నవీన్ రెడ్డి చెప్పారు...

‘‘ప్రేక్షకులను రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేసే చిత్రం ‘వెయ్ దరువెయ్’. నిజ జీవిత సంఘటనల ఆధారంగా పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కించాను’’ అని దర్శకుడు నవీన్ రెడ్డి చెప్పారు. సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన చిత్రమిది. ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నవీన్‌రెడ్డి సినిమా విశేషాలను మీడియాకు వివరించారు.
మా స్వస్థలం కృష్ణా జిల్లా పుట్రేల. సినిమాలపై ఆసక్తితో పుణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వ శాఖలో కోర్స్ చేసి, కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాను.
కామారెడ్డికి చెందిన ఓ యువకుడికి ఎదురైన సమస్య ఏమిటి?, దాని పరిష్కారం కోసం అతను ఏం చేశాడు? అనేది మా సినిమా కథ. ప్రతి ఒక్కరూ అనుభూతి చెందే నిజ జీవిత సంఘటనల ఆధారంగా పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కించాను. సీరియస్ పాయింట్‌ను ఎంటర్టైన్ చేసేలా చెప్పాం. నా సినిమాలో హీరో పాత్రకు సాయిరామ్ శంకర్ సూటవుతారనిపించి ఆయన్ను తీసుకున్నాం. హెబ్బా పటేల్ పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది.