ఆకాశం అంచుల్లోకి విజేత ప్రయాణం

ABN , Publish Date - Jun 19 , 2024 | 04:08 AM

అక్షయ్‌ కుమార్‌ హీ రోగా నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘సర్ఫీరా’. తమిళ చిత్రం ‘సూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’)కు ఇది రీమేక్‌. మాతృకకు దర్శకత్వం వహించిన సుధా కొంగర రీమేక్‌ను కూడా...

ఆకాశం అంచుల్లోకి విజేత ప్రయాణం

అక్షయ్‌ కుమార్‌ హీ రోగా నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘సర్ఫీరా’. తమిళ చిత్రం ‘సూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’)కు ఇది రీమేక్‌. మాతృకకు దర్శకత్వం వహించిన సుధా కొంగర రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. జూలై 12న ఈ చిత్రం విడుదలవుతోంది. మంగళవారం చిత్రబృందం ‘సర్ఫీరా’ ట్రైలర్‌ను విడుదల చేసింది. వైమానికదళ పైలెట్‌గా, ప్రేమికుడిగా, పేద ప్రజల విమాన ప్రయాణం కల సాకారమవ్వాలని తపించే వ్యక్తిగా విభిన్న కోణాల్లో అక్షయ్‌ నటన అలరించింది. ఒరిజినల్‌లో హీరోగా నటించిన సూర్య ఈ రీమేక్‌లో అతిథి పాత్రను పోషించడం విశేషం. అక్షయ్‌కు జోడీగా రాధికా మదన్‌ నటించారు. పరేశ్‌ రావల్‌, సీమా బిశ్వాస్‌ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. టు డీ ఎంటర్టైన్‌మెంట్‌, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, అబండెన్షియా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated Date - Jun 19 , 2024 | 04:08 AM