అంకితభావానికి ఫిదా
ABN , Publish Date - Dec 20 , 2024 | 02:14 AM
కీర్తి సురేశ్ ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, పెళ్లయి వారం తిరక్కుండానే కీర్తి తను నటించిన తొలి హిందీ చిత్రం ‘బేబీ జాన్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. దీంతో అందరూ ఆమె అంకితభావానికి ఫిదా...
కీర్తి సురేశ్ ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, పెళ్లయి వారం తిరక్కుండానే కీర్తి తను నటించిన తొలి హిందీ చిత్రం ‘బేబీ జాన్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. దీంతో అందరూ ఆమె అంకితభావానికి ఫిదా అయిపోతున్నారు. రెడ్ డ్రెస్‌లో ఆధునికంగా తయారై వచ్చినప్పటికీ, సంప్రదాయాన్ని వదలకుండా మెడలో పసుపుతాడుతో ముంబైలో చిత్రబృందం నిర్వహించిన ప్రమోషన్స్‌కి హాజరవటం అందరినీ ఆకట్టుకుంది. ఈ నెల 25న ‘బేబీ జాన్’ విడుదలవుతోంది. 2016లో విజయ్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వం వహించిన ‘తెరీ’ సినిమా ఆధారంగా రూపొందించారు. వరుణ్‌ధావణ్ కథానాయకుడిగా కలీస్ తెరకెక్కించారు. అట్లీ కథను అందించి, నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. కాగా, ఈ నెల 12న కీర్తి తన ప్రియుడు ఆంటోని తట్టిల్‌తో బంధు మిత్రుల సమక్షంలో గోవాలో తొలుత హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేశారు. ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలోనూ వధూవరువులు ఉంగరాలు మార్చుకున్నారు.