RA RAJA: ముఖాలు కనిపించకుండా సినిమా.. ’రారాజు‘ టీజర్ విడుదల చేసిన అల్లరి నరేశ్
ABN , Publish Date - Jun 17 , 2024 | 03:47 AM
సినిమా టైటిల్ కార్డ్స్ నుంచి శుభం కార్డుపడేవరకూ తెరపై ఎన్నో పాత్రలు వచ్చి పోతుంటాయి. అలాంటిది సినిమా ఆధ్యంతం పాత్రధారుల ముఖాలు కనిపించకుండా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించడం...
సినిమా టైటిల్ కార్డ్స్ నుంచి శుభం కార్డుపడేవరకూ తెరపై ఎన్నో పాత్రలు వచ్చి పోతుంటాయి. అలాంటిది సినిమా ఆధ్యంతం పాత్రధారుల ముఖాలు కనిపించకుండా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించడం సాధ్యమేనా? అరటే ఆ పనిని తాము విజయవంతంగా పూర్తి చేశామంటున్నారు దర్శక నిర్మాత బి. శివ ప్రసాద్. ఆయన రూపొందించిన ‘రారాజు’ చిత్రంలోని 24 మంది పాత్రధారుల ముఖాలు కనిపించవు. బిగి సడలని కథనం బోర్ కొట్టకుండా ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తుందని శివ ప్రసాద్ అన్నారు.
శనివారం ఈ చిత్రం టీజర్‌ను హీరో అల్లరి నరేశ్ ఆవిష్కరించారు. ‘ముఖాలు కనిపించకుండా సినిమా ఎలా తీయగలిగారు? అనే ఒక్క కారణం కోసమైనా ‘రారాజు’ చిత్రాన్ని చూడాలనిపిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా ట్రెండ్ సెట్ చేస్తుంద’ని అల్లరి నరేశ్ చెప్పారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. సుగి విజయ్, మౌనిక మగులూరీ హీరో హీరోయిన్లుగా నటించారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీ వాత్సవ్.