ట్రెండ్‌ సెట్‌ చేసే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:36 AM

ఇండియన్‌ స్ర్కీన్‌పై ఇప్పటివరకూ వచ్చిన మాఫియా నేపథ్య కథలకు పూర్తి భిన్నంగా పవన్‌కల్యాణ్‌ ‘ఓజీ’ కథ ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. గ్యాగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ కేరక్టరైజేషన్‌ ఊహలకు...

ట్రెండ్‌ సెట్‌ చేసే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా

ఇండియన్‌ స్ర్కీన్‌పై ఇప్పటివరకూ వచ్చిన మాఫియా నేపథ్య కథలకు పూర్తి భిన్నంగా పవన్‌కల్యాణ్‌ ‘ఓజీ’ కథ ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. గ్యాగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ కేరక్టరైజేషన్‌ ఊహలకు అందని విధంగా ఉంటుందని, అత్యంత శక్తివంతంగా ఆయన పాత్రను దర్శకుడు సుజిత్‌ డిజైన్‌ చేశారని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు వెంకట్‌ మాట్లాడుతూ ‘పవర్‌స్టార్‌ అభిమానులకు ‘ఓజీ’ విందుభోజనం లాంటి సినిమా. ఇందులో మంచి పాత్ర చేస్తున్నాను. ‘అన్నయ్య’ సినిమాలో చిరంజీవిగారి తమ్ముడిగా నటించిన నేను ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌తో కలిసి నటిస్తుంటే 23ఏళ్ల క్రితం ‘అన్నయ్య’ రోజులు గుర్తొస్తున్నాయి. ఇందులో కొన్ని సీన్స్‌ అభిమానులకు గూజ్‌బమ్స్‌ తెప్పిస్తాయి. టాలీవుడ్‌లో ఈ సినిమా కొత్త ట్రెండ్‌ సృష్టిస్తుంది’ అని తెలిపారు. జపాన్‌, ముంబై నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రీయారెడ్డి, ప్రకాశ్‌రాజ్‌ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, నిర్మాత: డీవీవీ దానయ్య, నిర్మాణం: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

Updated Date - Jan 08 , 2024 | 01:36 AM