మనసుకి హత్తుకొనే తల్లి కథ
ABN , Publish Date - Sep 27 , 2024 | 02:03 AM
సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఆశీస్సులతో ఆయన తనయుడు కిశోర్ చిత్రనిర్మాణరంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న ‘తల్లి మనసు’ చిత్ర షూటింగ్ పార్ట్ పూర్తయింది. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన తారాగణం...
సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఆశీస్సులతో ఆయన తనయుడు కిశోర్ చిత్రనిర్మాణరంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న ‘తల్లి మనసు’ చిత్ర షూటింగ్ పార్ట్ పూర్తయింది. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన తారాగణం. ఈ సినిమాతో వి.శ్రీనివాస్ (సిప్పి) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ముత్యాల కిశోర్ మాట్లాడుతూ ‘సినిమా ప్రారంభోత్సవం నాడు సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తామని చెప్పినట్టే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా షూటింగ్ చేసి వర్క్ పూర్తి చేశాం. మంచి కథ, కథనాలు సినిమాకు ప్రధాన బలం. అందుకు తగ్గ ఆర్టిస్టులు దొరికారు. వారందరి సహకారంతో మనసు కట్టి పడేసే అద్భుత చిత్రంగా రూపుదిద్దుకుంది. నాన్నగారి పర్యవేక్షణలో దర్శకుడు చక్కగా సినిమా తీశారు. తొలి ప్రయత్నంలోనే ఒక మంచి సినిమా తీసినందుకు ఆనందంగా ఉంది’ అన్నారు. వాస్తవిక జీవితానికి అద్దం పట్టే విధంగా ‘తల్లి మనసు’ ఉంటుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని ముత్యాల సుబ్బయ్య చెప్పారు.