మనసుకు హత్తుకునే అనుబంధం

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:42 AM

సముద్రఖని ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతోన్న ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’. ధనరాజ్‌ కీలకపాత్ర పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. పృథ్వీ పోలవరపు నిర్మిస్తున్నారు...

మనసుకు హత్తుకునే అనుబంధం

సముద్రఖని ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతోన్న ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’. ధనరాజ్‌ కీలకపాత్ర పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. పృథ్వీ పోలవరపు నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘సముద్రఖని అన్నయ్య సహాయం లేకపోతే ఈ సినిమా చేయలేను. తండ్రీ కొడుకుల అనుబంధాన్ని మనసుకు హత్తుకునేలా ఆవిష్కరిస్తుంది ఈ చిత్రం’ అన్నారు. సముద్రఖని మాట్లాడుతూ ‘ధనరాజ్‌కు తల్లిదండ్రులు లేరు. సొంతంగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాడు. అతనిపై నమ్మకంతో ఈ సినిమాకు దర్శకత్వం వహించమని చెప్పాను’ అన్నారు. ధనరాజ్‌ మాట్లాడుతూ ‘పిల్లలు అంతా తమ తండ్రితో కలసి చూడాల్సిన చిత్రం ఇది’ అన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 06:42 AM