టీనేజ్‌ లవ్‌స్టోరీ

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:08 AM

ఎస్‌.కె.ఎస్‌. ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించే చిత్రం షూటింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది. మురళీ అలకపల్లి దర్శకత్వంలో రాహుల్‌ శ్రీవాత్సవ్‌ నిర్మిస్తున్నారు. దేవుని ఫొటోలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు జర్నలిస్టు పర్వతనేని రాంబాబు

టీనేజ్‌ లవ్‌స్టోరీ

ఎస్‌.కె.ఎస్‌. ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించే చిత్రం షూటింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది. మురళీ అలకపల్లి దర్శకత్వంలో రాహుల్‌ శ్రీవాత్సవ్‌ నిర్మిస్తున్నారు. దేవుని ఫొటోలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు జర్నలిస్టు పర్వతనేని రాంబాబు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్టు ప్రభు క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘మా సంస్థ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. రెండో చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. దర్శకుడు మురళి చెప్పిన కథ నచ్చి మూడో చిత్రం ప్రారంభించాం. మూడు పాత్రల చుట్టూ జరిగే టీనేజ్‌ లవ్‌స్టోరీ ఇది. పేరున్న నటీనటులు నటిస్తారు. వారు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. మే రెండో వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’ అని చెప్పారు. గ్రామీణ నేపథ్యంగా సాగే ప్రేమ కథాచిత్రమిది. ముగ్గురు వ్యక్తుల మధ్య జరుగుతుంది. మంచి టీమ్‌తో త్వరలోనే మీ ముందుకు వస్తాం’ అని చెప్పారు దర్శకుడు. ఈ చిత్రానికి ఆంజనేయులు జక్క ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత.

Updated Date - Apr 27 , 2024 | 12:08 AM