వెన్నెల కిశోర్‌కు టైలర్‌ మేడ్‌ క్యారెక్టర్‌

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:56 AM

వెన్నెల కిశోర్‌ హీరోగా నటించిన ‘చారి 111’ చిత్రం మార్చి ఒకటిన విడుదల కానుంది. కీర్తి కుమార్‌ దర్శకత్వంలో ఆదితి సోని ఈ సినిమా నిర్మించారు. సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌. మంగళవారం ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో...

వెన్నెల కిశోర్‌కు టైలర్‌ మేడ్‌ క్యారెక్టర్‌

వెన్నెల కిశోర్‌ హీరోగా నటించిన ‘చారి 111’ చిత్రం మార్చి ఒకటిన విడుదల కానుంది. కీర్తి కుమార్‌ దర్శకత్వంలో ఆదితి సోని ఈ సినిమా నిర్మించారు. సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌. మంగళవారం ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది. అది రాసే బాధ్యతను నాకు అప్పగించారు. నన్ను నమ్మి దర్శకనిర్మాతలు రావడంతో పాట బాగా రావాలని మూడు నెలల సమయం తీసుకున్నా. మంచి సాహిత్యం కుదిరింది. వెన్నెల కిశోర్‌ ఈ సినిమాలో బాగా నవ్విస్తారు’ అని చెప్పారు. ‘బెంగళూరులో పదేళ్లు యాడ్‌ ఫీల్డ్‌లో ఉండి సినిమాల్లోకి వచ్చా. ఇంతకు ముందు ‘మళ్లీ మొదలైంది’ అనే సినిమా చేశా. అందులో వెన్నెల కిశోర్‌గారు కామెడీ రోల్‌ చేశారు. అప్పుడే ఈ చిత్ర కథ ఆయనకు చెప్పా. కిశోర్‌గారికి ఇది టైలర్‌ మేడ్‌ క్యారెక్టర్‌. ఇదొక స్పై యాక్షన్‌ కామెడీ జానర్‌ ఫిల్మ్‌. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. మొదట ఈ సినిమాను మే నెలలో విడుదల చేయాలనుకున్నాం. కానీ మంచి డేట్‌ దొరకడంతో మార్చి ఒకటిన విడుదల చేస్తున్నాం.’ అని చెప్పారు దర్శకుడు కీర్తికుమార్‌. నిర్మాత ఆదితి సోని మాట్లాడుతూ ‘నిర్మాతగా నాకు ఇది తొలి సినిమా. కొత్తగా ట్రై చేశాం. మంచి టీమ్‌ దొరికింది. వెన్నెల కిశోర్‌గారికి నేను అభిమానిని. ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. తెలుగులో తనకు ఇది తొలి చిత్రమని హీరోయిన్‌ సంయుక్త చెప్పారు. సినిమాలో తను ఫైట్స్‌ కూడా చేసినట్లు ఆమె తెలిపారు.

Updated Date - Feb 28 , 2024 | 03:56 AM