సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌

ABN, Publish Date - Jul 25 , 2024 | 06:12 AM

అనసూయ, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ‘సింబా’ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో దాసిర రాజేంద్రరెడ్డి నిర్మించిన చిత్రమిది. బుధవారం ఈ చిత్రం ట్రైలర్‌ను...

అనసూయ, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ‘సింబా’ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో దాసిర రాజేంద్రరెడ్డి నిర్మించిన చిత్రమిది. బుధవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ ‘ చాలా మంచి కాన్సెప్ట్‌తో ‘సింబా’ రూపుదిద్దుకుంది. జగపతిబాబు ఈ చిత్రానికి ప్రధాన బలం’ అన్నారు. ‘మా సినిమాకు కథే హీరో. ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోండి. ముందు తరాల గురించి ఆలోచించండి... అని చెబుతున్నాం’ అన్నారు నిర్మాత రాజేందర్‌రెడ్డి. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ఇదనీ, ఇంతవరకూ ఇండియన్‌ స్ర్కీన్‌ మీద ఇలాంటి కాన్సెప్ట్‌ రాలేదని దర్శకుడు మురళీ మనోహర్‌ చెప్పారు. ఈ సినిమాకు కథ, స్ర్కీన్‌ప్లే అందించిన సంపత్‌ నందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 25 , 2024 | 06:12 AM