సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:31 AM

వైవిధ్యమైన చిత్రాలతో అందరినీ ఆకట్టుకొంటున్న సుధీర్‌బాబు ఓ సూపర్‌ నేచురల్‌ మిస్టరీ థ్రిల్లర్‌లో నటించనున్నారు. మన పురాణాలతో అనుసంధానం చేస్తూ ఎన్నో...

సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌

వైవిధ్యమైన చిత్రాలతో అందరినీ ఆకట్టుకొంటున్న సుధీర్‌బాబు ఓ సూపర్‌ నేచురల్‌ మిస్టరీ థ్రిల్లర్‌లో నటించనున్నారు. మన పురాణాలతో అనుసంధానం చేస్తూ ఎన్నో రహస్యాలను వెలికి తీసే కథతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇంతకుముందెన్నడూ రాని డిఫరెంట్‌ కాన్సె్‌ప్టతో విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ రూపుదిద్దుకొనే ఈ చిత్రానికి వెంట్‌ కల్యాణ్‌ దర్శకుడు. ‘రుస్తమ్‌’, ‘టాయ్‌లెట్‌’, ‘ఏక్‌ ప్రేమ్‌ కథ’, ‘ప్యాడ్‌మ్యాన్‌’, ‘పరి’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రేరణ అరోరా సమర్పణలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇందులో సుధీర్‌ బాబు సరసన బాలీవుడ్‌ కథానాయిక నటిస్తుంది. ఆమె ఎవరనేది త్వరలో తెలియజేస్తామని దర్శకనిర్మాతలు చెప్పారు. ‘కుట్ర, పన్నాగాలతో మంచికి, చెడుకీ మధ్య జరిగే యుద్ధం ఈ చిత్ర ముఖ్యాంశం. పాన్‌ ఇండియా సినిమాల్లో ఓ మైల్‌ స్టోన్‌గా ఉంటుంది’ అని చెప్పారు దర్శకుడు కల్యాణ్‌. ఈ సినిమా గురించి సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘ఈ స్ర్కిప్ట్‌ నచ్చి ఏడాది నుంచి ఈ టీమ్‌తో ట్రావెల్‌ అవుతున్నాను.


డిఫరెంట్‌ కంటెంట్‌తో రూపొందనున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందా అని ఆతృతతో ఎదురుచూస్తున్నాను’ అని చెప్పారు. ఆగస్టు 15న ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తామనీ, సినిమాను శివరాత్రి సందర్భంగా వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేస్తామనీ ప్రేరణ అరోరా చెప్పారు.

Updated Date - Jul 02 , 2024 | 12:31 AM