జీవితం చెప్పిన కథ
ABN , Publish Date - Jan 01 , 2024 | 04:45 AM
దేవ్, ప్రియ చౌహాన్ , సరిత ప్రధాన తారాగణంగా మురళీ రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దీనమ్మ జీవితం’. వై మురళీకృష్ణ, డి. దివ్యసంతోషి, బి సోనియా నిర్మించారు...
దేవ్, ప్రియ చౌహాన్ , సరిత ప్రధాన తారాగణంగా మురళీ రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దీనమ్మ జీవితం’. వై మురళీకృష్ణ, డి. దివ్యసంతోషి, బి సోనియా నిర్మించారు. ఈ నెల 5న విడుదలవుతోంది. ఇటీవలే చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘డిఫరెంట్ కంటెంట్‌తో వస్తున్న చిత్రమిది. తమిళంలోనే కాదు తెలుగులోనూ కంటెంట్ ఆధారిత సినిమాలు తీయగలరని నిరూపిస్తుంది’ అని చెప్పారు. సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ ఇది, పెద్ద విజయాన్ని అందుకుంటామనే నమ్మకం ఉందని దేవ్ అన్నారు.