అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:21 AM

సినిమాలు నిర్మించాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో చిత్రపరిశ్రమలోకి వచ్చాను. మంచి కథ కోసం వెదుకుతున్నప్పుడు దర్శకుడు మల్లి ఈ కథ చెప్పారు...

అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ

సినిమాలు నిర్మించాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో చిత్రపరిశ్రమలోకి వచ్చాను. మంచి కథ కోసం వెదుకుతున్నప్పుడు దర్శకుడు మల్లి ఈ కథ చెప్పారు. పెళ్లి చుట్టూ తిరిగే ఈ కథలో కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌.. అన్నీ ఉన్నాయి. అందుకే ఆ కథతో ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం తీశాను’ అన్నారు నిర్మాత రాజీవ్‌ చిలక. అల్లరి నరేశ్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రం మే 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాజీవ్‌ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

  • ఈ కథ వినగానే నరేశ్‌గారినే హీరోగా అనుకున్నాం. మొదట మైండ్‌లోకి రాజేంద్రప్రసాద్‌గారు వచ్చినా యంగ్‌గా ఉంటే ఆయన పర్ఫెక్ట్‌. ఇప్పుడు నరేశ్‌కు యాప్ట్‌. మేం ఆయనకి కథ చెప్పినప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయన కోసం వెయిట్‌ చేశాం.


  • పెళ్లి కావడం లేదని చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. ఈ రోజుల్లో సెటిల్‌ అవడం కంటే పెళ్లి కావడం పెద్ద టాస్క్‌గా మారింది. అందుకే అందరికీ కనెక్ట్‌ అవుతుందని ఈ కథను ఎన్నుకుని వినోదాత్మకంగా చెప్పాం.

  • సినిమా కోసం కొన్ని టైటిల్స్‌ అనుకున్నాం కానీ సరిగ్గా సెట్‌ కాలేదు. అప్పుడు నరేశ్‌గారే ఈ టైటిల్‌ సూచించారు. హీరోని అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటారు. విసిగిపోయిన హీరో ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటుంటాడు. దర్శకుడు ఇవీవీ సత్యనారాయణగారి క్లాసిక్‌ సినిమా టైటిల్‌ ఇది. సినిమా చూసి హ్యాపీగా ఫీల్‌ అయిన నరేశ్‌గారు ఈ టైటిల్‌ వాడుకోండి అని చెప్పారు.

  • మా బేనరులో మంచి సినిమాలు తీయాలని ఉంది. ఫాంటసీ, హిస్టారికల్‌, కామెడీ జోనర్స్‌.. అన్ని రకాలు తీయాలని ఉంది. ఇక యానిమేషన్‌ విషయానికి వస్తే ‘ఛోటా భీమ్‌’ని పిల్లలతో చేయబోతున్నాం. అలాగే డిస్నీలో ఒక యానిమేషన్‌ షో లాంచ్‌ కాబోతోంది.

Updated Date - Apr 26 , 2024 | 06:21 AM