అన్ని వర్గాలను మెప్పించే కథ

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:41 AM

పార్వతీశం, ప్రణీకాన్విక జంటగా నటించిన చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మి’. వీ ఎస్‌ ముఖేశ్‌ యువ దర్శకత్వంలో అఖిలేశ్‌ కలారు నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను...

అన్ని వర్గాలను మెప్పించే కథ

పార్వతీశం, ప్రణీకాన్విక జంటగా నటించిన చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మి’. వీ ఎస్‌ ముఖేశ్‌ యువ దర్శకత్వంలో అఖిలేశ్‌ కలారు నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా పార్వతీశం మాట్లాడుతూ ‘ ‘కేరింత’ చిత్రంలానే ‘మార్కెట్‌ మహాలక్ష్మి’ నాకు మరో హిట్‌ చిత్రమవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో దర్శకుడు సినిమాను తెరకెక్కించాడు’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కథలో మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అని దర్శకుడు చెప్పారు. కంటెంట్‌పైన నమ్మకంతో ఈ సినిమాను నిర్మించాను, అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది అని నిర్మాత చెప్పారు.

Updated Date - Mar 13 , 2024 | 03:41 AM