ఇద్దరు మిత్రుల కథ

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:15 AM

ఆశిష్‌ గాంధీ, అశోక్‌, వర్ష, హ్రితిక హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘హద్దు లేదురా’. రాజశేఖర్‌ రావి దర్శకుడు. వీరేశ్‌ గాజుల నిర్మాత. సోమవారం రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో చిత్రం టీజర్‌ విడుదల...

ఇద్దరు మిత్రుల కథ

ఆశిష్‌ గాంధీ, అశోక్‌, వర్ష, హ్రితిక హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘హద్దు లేదురా’. రాజశేఖర్‌ రావి దర్శకుడు. వీరేశ్‌ గాజుల నిర్మాత. సోమవారం రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో చిత్రం టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్బంగా హీరో ఆశిష్‌ గాంధీ మాట్లాడుతూ ‘నేను నటించిన ‘నాటకం’ టీజర్‌ ఇక్కడే లాంచ్‌ అయింది. ఆ సినిమా పెద్ద హిట్‌ అయింది. అలాగే ‘హద్దు లేదురా’ కూడా సూపర్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. సినిమా బాగా వచ్చింది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘భారతంలో శ్రీకృష్ణార్జునులు స్నేహంగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించుకున్నారు. అలాగే ఇద్దరు స్నేహితులు కూడా వారికి వచ్చిన సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకున్నారో అనే కథాంశంతో ఈ సినిమా తీశాం. ముఖ్యంగా క్లైమాక్స్‌ అద్భుతంగా వచ్చింది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ వారికి మా సినిమా నచ్చడం ఆనందంగా ఉంది. గీత రచయిత కమల్‌ కుమార్‌ అద్భుతమైన ఐదు పాటలు ఇచ్చారు. వారు మనమధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. త్వరలో పాటలను విడుదల చేస్తాం’ అన్నారు. స్నేహం నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ హిట్‌ అయ్యాయనీ, ‘హద్దు లేదురా’ కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని మరో హీరో రోహిత్‌ చెప్పారు.

Updated Date - Feb 20 , 2024 | 05:15 AM