ముగ్గురు స్నేహితుల కథ

ABN, Publish Date - Jul 17 , 2024 | 06:21 AM

మక్కా శ్రీను, సుచిత్ర రాథోడ్‌, దిల్‌ రమేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఎస్‌.ఐ.కోదండపాణి’. రెంటాల నాగేంద్ర దర్శకత్వంలో మక్కా శ్రీదేవి నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ప్రీమియర్‌ షోను...

మక్కా శ్రీను, సుచిత్ర రాథోడ్‌, దిల్‌ రమేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఎస్‌.ఐ.కోదండపాణి’. రెంటాల నాగేంద్ర దర్శకత్వంలో మక్కా శ్రీదేవి నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ప్రీమియర్‌ షోను మీడియాకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ రెంటాల నాగేంద్ర మాట్లాడుతూ ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించాను. ముగ్గురు స్నేహితులు ఓ మర్డర్‌ మిస్టరీలో ఇరుక్కుని ఎలా బయటపడారనేది సినిమా కథ’’ అని అన్నారు. ‘‘కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాత శ్రీదేవి అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: ఉదయ్‌, కెమెరామెన్‌: సబరి, సంగీతం: సాల్మన్‌.

Updated Date - Jul 17 , 2024 | 06:21 AM