ముగ్గురు స్నేహితుల కథ

ABN , Publish Date - May 09 , 2024 | 06:27 AM

నటుడు సత్యదేవ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’ ఈ శుక్రవారం విడుదలవుతోన్న సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సత్యదేవ్‌ మీడియాతో...

ముగ్గురు స్నేహితుల కథ

నటుడు సత్యదేవ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’ ఈ శుక్రవారం విడుదలవుతోన్న సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సత్యదేవ్‌ మీడియాతో ముచ్చటించారు.

‘‘ఇది ముగ్గురు స్నేహితుల కథ. మంచి జీవితం కోరుకునే ఆ ముగ్గురి కల చెదిరితే వారు ఏం చేశారనేది సినిమా కథాంశం. ఈ సినిమాలో వించిపేట భద్ర అనే క్యారెక్టర్‌లో నటించాను. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ రోల్‌ను డిజైన్‌ చేశారు. ఇందులో లుక్‌ వేరియేషన్స్‌ ఉంటాయి, ఆ మేకోవర్‌ కోసం చాలా కష్టపడ్డాను. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు ఈ పాత్రతో ఒక ఎమోషనల్‌ ట్రావెల్‌ ఏర్పడుతుంది’’ అని చెప్పారు.

Updated Date - May 09 , 2024 | 06:27 AM