గుజరాత్‌లో గూఢచారి

ABN , Publish Date - Mar 30 , 2024 | 04:39 AM

అడివిశేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గూఢచారి 2’. గతంలో ఆయన నటించిన హిట్‌ చిత్రం ‘గూఢచారి’కి ఇది సీక్వెల్‌. బనితా సంధు శేష్‌కు జోడీగా నటిస్తున్నారు...

గుజరాత్‌లో గూఢచారి

అడివిశేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గూఢచారి 2’. గతంలో ఆయన నటించిన హిట్‌ చిత్రం ‘గూఢచారి’కి ఇది సీక్వెల్‌. బనితా సంధు శేష్‌కు జోడీగా నటిస్తున్నారు. ‘అక్టోబర్‌’, ‘సర్దార్‌ ఉదం’ చిత్రాలతో ఆమె హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లోని భుజ్‌లో జరుగుతున్న షూటింగ్‌లో శేష్‌తో కలసి బనిత పాల్గొంటున్నారు. వారిద్దరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఎడారిలో ఉన్న బనిత ఫొటోను చిత్రబృందం షేర్‌ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇమ్రాన్‌హష్మీ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. వినయ్‌కుమార్‌ సిరిగినీడి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు.

Updated Date - Mar 30 , 2024 | 04:39 AM