యువతకు నచ్చే సోలో బాయ్‌

ABN , Publish Date - Feb 09 , 2024 | 03:06 AM

బిగ్‌బాస్‌ ఫేమ్‌ గౌతమ్‌ కృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి ‘సోలో బాయ్‌’ టైటిల్‌ ఖరారైంది. పీ నవీన్‌ కుమార్‌ దర్శకత్వంలో సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ నిర్మించారు. బుధవారం చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది...

యువతకు నచ్చే సోలో బాయ్‌

బిగ్‌బాస్‌ ఫేమ్‌ గౌతమ్‌ కృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి ‘సోలో బాయ్‌’ టైటిల్‌ ఖరారైంది. పీ నవీన్‌ కుమార్‌ దర్శకత్వంలో సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ నిర్మించారు. బుధవారం చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘మా నిర్మాణంలో వచ్చిన ‘బట్టల రామస్వామి బయోపిక్‌’ ప్రేక్షకులను అలరించింది. ‘సోలో బాయ్‌’ చిత్రం ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తుంది’ అన్నారు. గౌతమ్‌ కృష్ణ మాట్లాడుతూ ‘‘ఆకాశవీధిలో’ చిత్రంతో నటుడిగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువవుతాననే నమ్మకం ఉంది’ అన్నారు. యువతకు, కుటుంబ ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందని దర్శకుడు తెలిపారు.

Updated Date - Feb 09 , 2024 | 03:06 AM