నవ్వించే గూఢచారి

ABN , Publish Date - Feb 13 , 2024 | 05:59 AM

వెన్నెల కిశోర్‌ హీరోగా నటించిన చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్‌ హీరోయిన్‌. టీజీ కీర్తికుమార్‌ దర్శకత్వంలో అదితీ సోనీ నిర్మించారు...

నవ్వించే గూఢచారి

వెన్నెల కిశోర్‌ హీరోగా నటించిన చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్‌ హీరోయిన్‌. టీజీ కీర్తికుమార్‌ దర్శకత్వంలో అదితీ సోనీ నిర్మించారు. మార్చి 1న విడుదలవుతోంది. సోమవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. సీరియస్‌గా కనిపిస్తూ, నవ్వించే గూఢచారిగా ట్రైలర్‌లో వెన్నెల కిశోర్‌ అలరించారు. ఈ ట్రైలర్‌ జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే, సినిమాలో ఇంతకు మించి వినోదం ఉంటుంది అని దర్శకుడు తెలిపారు.

Updated Date - Feb 13 , 2024 | 05:59 AM