నవ్వించే గూఢచారి

ABN , Publish Date - Feb 09 , 2024 | 03:08 AM

హాస్య నటుడు వెన్నెల కిశోర్‌ హీరోగా నటించిన ‘చారి 111’ చిత్రం మార్చి ఒకటిన విడుదల కానుంది. టీజీ కీర్తికుమార్‌ దర్శకత్వంలో ఆదితి సోని నిర్మించిన సినిమా ఇది. సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌గా నటించారు. కన్‌ప్యూజ్‌ అయ్యే గూఢచారిగా వెన్నెల కిశోర్‌...

నవ్వించే గూఢచారి

హాస్య నటుడు వెన్నెల కిశోర్‌ హీరోగా నటించిన ‘చారి 111’ చిత్రం మార్చి ఒకటిన విడుదల కానుంది. టీజీ కీర్తికుమార్‌ దర్శకత్వంలో ఆదితి సోని నిర్మించిన సినిమా ఇది. సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌గా నటించారు. కన్‌ప్యూజ్‌ అయ్యే గూఢచారిగా వెన్నెల కిశోర్‌ కనిపిస్తారని దర్శకనిర్మాతలు చెప్పారు. ‘ఇదొక స్పై యాక్షన్‌ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్‌ చేసే గూఢచారి ఒక పెద్ద కేసుని ఎలా పరిష్కరించాడన్న అంశంతో చిత్రాన్ని రూపొందించాం. వెన్నెల కిశోర్‌, సంయుక్త గూఢచారి పాత్రలు పోషించారు. వాళ్ల బాస్‌గా మురళీశర్మ కీలక పాత్ర చేశారు.’ అని దర్శకుడు చెప్పారు. గూఢచారి చిత్రాల్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుందని నిర్మాత తెలిపారు. త్వరలో పాటలు, ట్రైలర్‌ను విడుదల చేస్తామని చెప్పారు.

Updated Date - Feb 09 , 2024 | 03:08 AM