జైలుకి వెళ్లిన గొర్రె

ABN , Publish Date - Sep 17 , 2024 | 05:31 AM

సుహాస్‌ హీరోగా నటించిన యూనిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘గొర్రె పురాణం’ ఈ నెల 20న విడుదల కానుంది. పురాణం బాబీ దర్శకత్వంలో ప్రవీణ్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు...

సుహాస్‌ హీరోగా నటించిన యూనిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘గొర్రె పురాణం’ ఈ నెల 20న విడుదల కానుంది. పురాణం బాబీ దర్శకత్వంలో ప్రవీణ్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘నా పేరు రామ్‌.. అలియాస్‌ యేసు. గొర్రె జైల్లో ఉండడం ఏందీ.. ఆడికెల్లి తప్పించుకోవడం ఏంది? ఇదంతా మీకు వింతగా ఉంది కదూ’ అనే వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఒక గొర్రె ఓ గ్రామంలో రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన నేపథ్యాన్ని చాలా ఆసక్తికరంగా ప్రజెంట్‌ చేశారు. పోసాని కృష్ణమురళి, రఘు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - Sep 17 , 2024 | 05:31 AM