Darshini: సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌.. త్వరలోనే..

ABN , Publish Date - May 02 , 2024 | 04:30 AM

వికాస్‌, శాంతి హీరో హీరోయిన్లుగా డాక్టర్‌ ప్రదీప్‌ అల్లు దర్శకత్వంలో డాక్టర్‌ ఎల్‌ వీ సూర్యం నిర్మించిన సైన్ష్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘దర్శిని’. త్వరలో...

Darshini: సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌.. త్వరలోనే..

వికాస్‌, శాంతి హీరో హీరోయిన్లుగా డాక్టర్‌ ప్రదీప్‌ అల్లు దర్శకత్వంలో డాక్టర్‌ ఎల్‌ వీ సూర్యం నిర్మించిన సైన్ష్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘దర్శిని’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కామెడీ, లవ్‌, ఎమోషన్‌... అన్ని అంశాలు కుదిరాయి, సినిమాను ఈ నెల్లో విడుదల చేస్తామ’ని తెలిపారు. మూడు పాత్రల చుట్టూ అల్లుకున్న కథ ఇది, కాన్సెప్ట్‌ ఆసక్తికరంగా ఉంటుంది అని నిర్మాత తెలిపారు.

హీరో వికాస్ మాట్లాడుతూ.. మా చిత్రానికి పునాది మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు. ఈ జర్నీలో చాలా కష్టాలు చూశాము కానీ సినిమా మీద ప్యాషన్‌తో కష్టపడి పని చేశాము. సినిమా చాలా బాగా వచ్చింది, త్వరలో విడుదల అవుతుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు.

Darsini.jpg

Updated Date - May 02 , 2024 | 01:58 PM