రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

ABN , Publish Date - Sep 06 , 2024 | 12:25 AM

యువతరానికి నచ్చే అంశాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రోటీ కపడా రొమాన్స్‌’ అక్టోబరు 4న విడుదల కానుంది...

యువతరానికి నచ్చే అంశాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రోటీ కపడా రొమాన్స్‌’ అక్టోబరు 4న విడుదల కానుంది. హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్‌, నువ్వేక్ష, మేఘలేఖ, కుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. విక్రమ్‌రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్‌, సృజన్‌కుమార్‌ బొజ్జం నిర్మాతలు. సినిమాలో ప్రతి పాత్ర యూత్‌కు కనెక్ట్‌ అవుతుందనీ, రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌ ప్రధాన బలాలు అని దర్శకుడు తెలిపారు. కొత్త పాయింట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనీ, అది ఈ రేంజ్‌ అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారనీ నిర్మాతలు చెప్పారు.

Updated Date - Sep 06 , 2024 | 12:25 AM