రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌

ABN , Publish Date - Jan 07 , 2024 | 02:52 AM

నారా రోహిత్‌ కథానాయకుడిగా నూతన చిత్రం ప్రారంభమైంది. వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంతోష్‌ చిన్నపొళ్ల, గౌతమ్‌రెడ్డి, రాకేష్‌ మహంకాళి నిర్మిస్తున్నారు. ‘నారా రోహిత్‌ 20’ వర్కింగ్‌ టైటిల్‌...

రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌

నారా రోహిత్‌ కథానాయకుడిగా నూతన చిత్రం ప్రారంభమైంది. వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంతోష్‌ చిన్నపొళ్ల, గౌతమ్‌రెడ్డి, రాకేష్‌ మహంకాళి నిర్మిస్తున్నారు. ‘నారా రోహిత్‌ 20’ వర్కింగ్‌ టైటిల్‌. శనివారం చిత్రీకరణ ప్రారంభమైంది. తొలిషాట్‌కు సినిమాటోగ్రాఫర్‌ ప్రదీష్‌ ఎం వర్మ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. గౌతమ్‌రెడ్డి క్లాప్‌ ఇచ్చారు. విజయ్‌ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వీర్తి వాఘని కథానాయిక. శ్రీదేవి విజయ్‌కుమార్‌, వీకే నరేశ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. లియోన్‌జేమ్స్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 02:52 AM