చక్కనమ్మకు నవ్వు తెచ్చిన చిక్కు

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:19 AM

అందం, అభినయంతో పాటు చక్కని చిరునవ్వుతో ప్రేక్షకులకు కనువిందు చేసి అగ్రకథానాయిక కొనసాగుతున్నారు అనుష్కశెట్టి. అయితే ఆ అందమైన చిరునవ్వే తనకు కొన్ని సమస్యలు తెచ్చిపెట్టిందంటున్నారు...

చక్కనమ్మకు నవ్వు తెచ్చిన చిక్కు

అందం, అభినయంతో పాటు చక్కని చిరునవ్వుతో ప్రేక్షకులకు కనువిందు చేసి అగ్రకథానాయిక కొనసాగుతున్నారు అనుష్కశెట్టి. అయితే ఆ అందమైన చిరునవ్వే తనకు కొన్ని సమస్యలు తెచ్చిపెట్టిందంటున్నారు అనుష్క. ఆమె ఓ అరుదైన సమస్యతో బాధపడుతున్నారు. అనుష్క నవ్వడం మొదలుపెడితే, 15 నుంచి 20 నిమిషాల పాటు ఏకబిగిన నవ్వుతూనే ఉంటారట. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో అనుష్క ఈ విషయాన్ని చెప్పారు. దీనివల్ల పలు సందర్భాల్లో సినిమా షూటింగ్స్‌కు బ్రేక్‌ పడిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. సెట్‌లో, నలుగురిలోకి వెళ్లినప్పుడు ఇలా నవ్వడం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురయినట్లు ఆమె చెప్పారు. ఇలా అకస్మాత్తుగా వచ్చే నవ్వును అదుపుచేసుకోలేని పరిస్థితిని వైద్య పరిభాషలో పీబీఏ (సూడోబల్బార్‌ ఎఫెక్ట్‌) అంటారు.

Updated Date - Jun 27 , 2024 | 12:19 AM