Rare honor for Shah Rukh Khan : షారుక్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:15 AM

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం లభించింది. స్విట్జర్లాండ్‌లోని లోకర్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించే అక్కడి జ్యూరీ సభ్యులు.. ఫారుక్‌ ఖాన్‌ను ఈ ఏడాది జరిగే ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సత్కరించనున్నారు...

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం లభించింది. స్విట్జర్లాండ్‌లోని లోకర్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించే అక్కడి జ్యూరీ సభ్యులు.. ఫారుక్‌ ఖాన్‌ను ఈ ఏడాది జరిగే ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సత్కరించనున్నారు. షారుక్‌కు ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రకటించింది. అంతే కాకుండా.. ఆయన సినిమాల్లో క్లాసికల్‌ హిట్‌గా మిగిలిన ‘దేవదాసు’ సినిమాను కూడా ఆ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో స్ర్కీనింగ్‌కు ఎంపిక చేసింది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శత్వంలో 2003లో రిలీజైన ఈ సినిమా విమర్శకులు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ అవార్డుకు సంబంధించిన వివరాలను సోషల్‌ మీడియాలో ప్రకటించిన ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులు.. షారుక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘షారుక్‌ లాంటి దిగ్గజ నటుడ్ని మా ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఆహ్వానించాలనే కోరిక ఈ 77వ ఎడిషన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌తో తీరింది.


నిర్మాతగా, నటుడిగా భారతీయ సినిమా ఇండస్ట్రీపై తనదైన ముద్ర వేసిన ఆయన్ని సత్కరించడం మా గౌరవం’. కాగా, ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ స్విట్జర్లాండ్‌లో వచ్చే నెల 7 నుంచి 17వ తేదీ వరకు జరుగుతుంది. ఈ అవార్డును షారుక్‌ ఆగస్టు 10న అందుకోనున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 03:16 AM