సమంతకు అరుదైన గౌరవం

ABN , Publish Date - Sep 15 , 2024 | 02:50 AM

నటి సమంతకు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) ఉత్సవం అవార్డ్స్‌ కార్యక్రమం ఈ నెల 27న దుబాయ్‌లో జరగనుంది. కార్యక్రమంలో ఆమెను ‘ఉమెన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుతో...

నటి సమంతకు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) ఉత్సవం అవార్డ్స్‌ కార్యక్రమం ఈ నెల 27న దుబాయ్‌లో జరగనుంది. కార్యక్రమంలో ఆమెను ‘ఉమెన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుతో సన్మానించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ‘‘ఈ తరానికి చెందిన ఉత్తమ నటుల్లో సమంత ఒకరు. తన వైవిధ్యమైన పాత్రలతో అభిమానులను నిరంతరం ఆకట్టుకునే ఆమెకు ఈ అవార్డును అందజేయటం ఆనందంగా ఉంది’’ అని ఐఫా నిర్వాహకులు తెలిపారు. ‘‘ఐఫా ఉత్సవం నాకెల్లప్పుడూ ప్రత్యేకమే. దక్షిణాది సినిమాను ప్రపంచ ప్రేక్షకులకు తెలియజెప్పే ఈ వేదికపై పాల్గొనడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను’’ అని సమంత పేర్కొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 10:02 AM