అరుదైన గౌరవం

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:16 AM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ఆస్కార్‌ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటారు దర్శక ధీరుడు రాజమౌళి. అంతే కాదు ఆ సినిమాతో ప్రపంచమంతా తన ప్రతిభకు తగిన గుర్తింపు పొందడంతో పాటు ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ సాధించారు. తాజాగా ఆస్కార్‌ అకాడెమీలో...

అరుదైన గౌరవం

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ఆస్కార్‌ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటారు దర్శక ధీరుడు రాజమౌళి. అంతే కాదు ఆ సినిమాతో ప్రపంచమంతా తన ప్రతిభకు తగిన గుర్తింపు పొందడంతో పాటు ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ సాధించారు. తాజాగా ఆస్కార్‌ అకాడెమీలో చేరేందుకు ఆహ్వానం అందుకొని అరుదైన గౌరవం పొందారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా పని చేసిన రమా రాజమౌళి కూడా ఈ గౌరవంలో భాగమయ్యారు. ఈ ఏడాది 57 దేశాల నుంచి మొత్తం 487 మంది కొత్త సభ్యులకు ఆస్కార్‌ అకాడెమీ ఆహ్వానం పంపింది. వీరిలో రాజమౌళి, రమతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి షబానా అజ్మీ, రితేశ్‌ సిద్వానీ, రవి వర్మన్‌, రీమా దాస్‌, ఆనంద్‌కుమార్‌ టక్కర్‌ , నిషా పహుజా, హేమల్‌ త్రివేది, గితేష్‌ పాండ్యా ఉన్నారు.


ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు ’ పాటకు ఆస్కార్‌ అవార్డ్‌ సాదించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం టీమ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, కీరవాణి, చంద్రబోస్‌, సెంథిల్‌కుమార్‌, సాబు శిరిల్‌కు ఆస్కార్‌ అకాడెమీ కొత్త సభ్యులుగా గత ఏడాది ఆహ్వనం అందింది.

Updated Date - Jun 27 , 2024 | 12:16 AM