అరుదైన ఘనత
ABN , Publish Date - Oct 23 , 2024 | 02:17 AM
శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్‌చేంజర్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతోంది. మరోవైపు, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న ‘ఆర్‌సీ 16’ గురించి....
శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్‌చేంజర్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతోంది. మరోవైపు, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న ‘ఆర్‌సీ 16’ గురించి ఓ కీలక అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలాఖరు నుంచి మైసూరులో ప్రారంభం అవుతుంది. మైసూరులో 15 రోజుల పాటు షూట్ జరుపుతారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఓ భారీ సెట్ వేసి షూటింగ్‌ను కొనసాగిస్తారు.
క్వీన్ ఎలిజిబెత్ తర్వాత...
సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వేసవి నుంచి ఈ విగ్రహం సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ఈ విగ్రహంలో రామ్‌చరణ్‌తో పాటు తన పెంపుడు కుక్క రైమీ కూడా కనువిందు చేయనుంది. క్వీన్ ఎలిజిబెత్ తర్వాత పెంపుడు కుక్కతో మైనపు విగ్రహంలో కనిపించే రెండో వ్యక్తి రామ్‌చరణే అట. ఈ అరుదైన గౌరవం తమ అభిమాన హీరోకి దక్కడంతో, రామ్‌చరణ్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.
రూ. పది కోట్ల కొత్త కారు...
రామ్‌చరణ్ గ్యారేజ్‌లో కొత్త కారు చేరింది. దాదాపు రూ. పది కోట్ల విలువైన రోల్స్ రాయిస్ స్పెక్ర్టి ఇంపోర్టెడ్ కారును ఆయన ఇటీవలే కొనుగోలు చేశారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం తన కారును రిజిస్ర్టేషన్ చేయించారు. రోల్స్ రాయిస్ నుంచి వెలువడిన మొదటి ఎలక్ర్టిక్ కారు ఇదే.