ట్వల్త్ ఫెయిల్‌కు ప్రీక్వెల్
ABN, Publish Date - Oct 03 , 2024 | 02:46 AM
విధువినోద్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ట్వల్త్ ఫెయిల్’ బయోపిక్ ప్రేక్షకుల నుంచి ఎంతటి ఆదరాభిమానాలను అందుకుందో తెలిసిందే. విక్రంత్ మస్సే ఇందులో ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్...
విధువినోద్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ట్వల్త్ ఫెయిల్’ బయోపిక్ ప్రేక్షకుల నుంచి ఎంతటి ఆదరాభిమానాలను అందుకుందో తెలిసిందే. విక్రంత్ మస్సే ఇందులో ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మగా.. కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా, జరిగిన ఓ మీడియా సమావేశంలో.. ‘ట్వల్త్ ఫెయిల్’ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘జీరో సే రీస్టార్ట్’ సినిమాను డిసెంబరు 13న విడుదల చేయనున్నట్లు విధువినోద్ చోప్రా ప్రకటించారు. ‘‘మొదటి భాగంలో ఉన్న నటీనటులే ఇందులోనూ కొనసాగుతారు. ఈ ప్రీక్వెల్ కథానాయకుడి బ్యాక్ స్టోరీపై ఫోకస్ చేస్తుంది. ఇందులో మనోజ్ కుమార్ జీవితాన్ని మార్చేసిన సంఘటనలను ఆసక్తికరంగా చూపించనున్నాం’’ అని చెప్పారు.