ప్రీక్వెల్‌ చేయాలని ఉంది

ABN , Publish Date - Oct 18 , 2024 | 12:43 AM

‘జై భీమ్‌’ ఫేమ్‌ టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘వేట్టయాన్‌’. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా...

‘జై భీమ్‌’ ఫేమ్‌ టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘వేట్టయాన్‌’. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు టీ.జీ.జ్ఞానవేల్‌ మీడియాతో ముచ్చటించారు.

‘‘రజనీ నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో బాగా తెలుసు. అందుకే ఈ స్ర్కిప్టులో ఆయన కోసం ఎన్నో మార్పులు చేశాను. ఇందులో రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పరంగా ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్‌ కమర్షియల్‌ అంశాలను ఇటువంటి సీరియస్‌ కథలో బ్యాలెన్స్‌ చేయడమే. అనిరుధ్‌ సంగీతం సినిమాకు ప్లస్సయ్యింది. ఈ సినిమాకు ప్రీక్వెల్‌ చేయాలని ఉంది’’ అని చెప్పారు.

Updated Date - Oct 18 , 2024 | 12:43 AM