ఓ పోలీస్‌ ఆఫీసర్‌ జీవిత కథ

ABN , Publish Date - May 29 , 2024 | 06:19 AM

పవర్‌ఫుల్‌ ఇన్వెస్టిగేటివ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో పాయల్‌ రాజ్‌పుత్‌ నటించిన ‘రక్షణ’ చిత్రం జూన్‌ 7న విడుదల కానుంది. ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో...

ఓ పోలీస్‌ ఆఫీసర్‌ జీవిత కథ

పవర్‌ఫుల్‌ ఇన్వెస్టిగేటివ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో పాయల్‌ రాజ్‌పుత్‌ నటించిన ‘రక్షణ’ చిత్రం జూన్‌ 7న విడుదల కానుంది. ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఓ పోలీస్‌ ఆఫీసర్‌ జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో రూపొందించిన చిత్రమిది. ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం’ అని తెలిపారు. రోషన్‌, మానస్‌, రాజీవ్‌ కనకాల, వినోద్‌ బాల, శివన్నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మహతి సాగర్‌, ఛాయాగ్రహణం: అనిల్‌ భండారి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: ప్రకాశ్‌ జోసెఫ్‌, రమేశ్‌రెడ్డి.

Updated Date - May 29 , 2024 | 06:19 AM