అన్ని ఎలిమెంట్స్‌తో నిండిన చిత్రం

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:36 AM

‘క్రేజీ బాయ్‌’ ఫేమ్‌ దిలీప్‌ప్రకాశ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఉత్సవం’. ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, నాజర్‌, రెజీన కసాండ్ర కీలక పాత్రలు పోషించారు. అర్జున్‌ సాయి దర్శకత్వంలో...

‘క్రేజీ బాయ్‌’ ఫేమ్‌ దిలీప్‌ప్రకాశ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఉత్సవం’. ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, నాజర్‌, రెజీన కసాండ్ర కీలక పాత్రలు పోషించారు. అర్జున్‌ సాయి దర్శకత్వంలో సురేశ్‌ పాటిల్‌ నిర్మించారు. ఈ నెల 13న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దిలీప్‌ మీడియాతో ముచ్చటించారు.

‘‘ఇది ఎంతో ఉన్నతమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం. ఇందులో కథనే హీరో. రంగస్థల కళాకారుల జీవితాలతో ముడిపడిన చిత్రమిది. ఎంతో అనుభవమున్న నటులు ఇందులో నటించారు. మంచి సందేశం, ప్రేమ కథ, వినోదంతో పాటు ప్రేక్షకులు కోరుకునే అన్ని రకాల ఎలిమెంట్స్‌తో నిండిన చిత్రమిది. అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఈ సినిమాకు బ్రహ్మ కడలి అందించిన ఆర్ట్‌ వర్క్‌ ప్రత్యేకాకర్షణ. నాకు యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. నా నెక్స్ట్‌ సినిమా అదే తరహాలో ఉండబోతోంది’.

Updated Date - Sep 10 , 2024 | 03:36 AM