పీరియాడికల్‌ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా

ABN , Publish Date - May 05 , 2024 | 06:32 AM

‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ వంటి సున్నితమైన ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విరించి వర్మ. ఈ సారి తన రూట్‌ మార్చి పీరియాడికల్‌ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా ‘జితేందర్‌ రెడ్డి’ సినిమాకు...

పీరియాడికల్‌ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా

‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ వంటి సున్నితమైన ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విరించి వర్మ. ఈ సారి తన రూట్‌ మార్చి పీరియాడికల్‌ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా ‘జితేందర్‌ రెడ్డి’ సినిమాకు దర్శకత్వం వహించారు. 1980లో జరిగిన యదార్థ సంఘటనల నేపధ్యంలో స్టూడెంట్‌ లీడర్‌ జితేందర్‌ రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. రాకేశ్‌ వర్రీ, వైశాలి రాజ్‌, రియా సుమన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్‌, గ్లింప్స్‌, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేసి రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఈ నెల 10న మూవీ విడుదలవుతోంది. ఈ చిత్రానికి డిఓపీ: వి.ఎస్‌.జ్ఞానశేఖర్‌, సంగీతం: గోపి సుందర్‌, కో ప్రొడ్యూసర్‌: ఉమ రవీందర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వాణిశ్రీ పొడుగు.

Updated Date - May 05 , 2024 | 06:32 AM