‘హరిహర వీరమల్లు’ వచ్చేది ఎప్పుడంటే

ABN , Publish Date - Jun 30 , 2024 | 06:41 AM

పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘హరిహరవీరమల్లు’ మీదే ఇప్పుడందరి దృష్టీ ఉంది. అగ్ర నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ఈ సినిమా విడుదల ఎప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరో

‘హరిహర వీరమల్లు’ వచ్చేది ఎప్పుడంటే

పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘హరిహరవీరమల్లు’ మీదే ఇప్పుడందరి దృష్టీ ఉంది. అగ్ర నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ఈ సినిమా విడుదల ఎప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరో పవన్‌కల్యాణ్‌ రాజకీయాలతో బిజీ కావడం వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ గెలిచి, ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి, బిజీగా ఉండడంతో ఆయన ఆర్టిస్టుగా తిరిగి సెట్‌లోకి అడుగు పెట్టడానికి మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రం గురించి అప్‌డేట్‌ ఇచ్చారు నిర్మాత ఎ.ఎం.రత్నం. ‘సినిమాలో పవన్‌కల్యాణ్‌ వర్క్‌ దాదాపు పూర్తయింది. మరో 20-25 రోజులు ఆయన కేటాయిస్తే షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. ప్రస్తుతం పవన్‌కు ఉన్న బిజీ షెడ్యూల్‌ ను దృష్టిలో పెట్టుకుని షూటింగ్‌ ప్లాన్‌ చేస్తాం. మా సినిమా స్ర్టీమింగ్‌ రైట్స్‌ అమెజాన్‌కు ఇచ్చాం. వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం అక్టోబరులో సినిమాను విడుదల చేయాలి. అయితే ఇంకాస్త సమయం కావాలని వాళ్లను అడుగుతాం. డిసెంబర్‌ నాటికి విడుదల చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది’ అని చెప్పారు. సినిమా ఆలస్యం అవుతున్న కారణంగా ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్‌ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

Updated Date - Jun 30 , 2024 | 06:41 AM