పర్ఫెక్ట్‌ సమ్మర్‌ ట్రీట్‌

ABN , Publish Date - Apr 30 , 2024 | 06:35 AM

సక్సె్‌సఫుల్‌ హార్రర్‌ కామెడీ సిరీస్‌ ‘అరణ్మనై’లో నాలుగో భాగంగా వస్తున్న చిత్రం ‘అరణ్మనై 4’. తెలుగులో ఈ చిత్రాన్ని ‘బాక్‌’ పేరుతో విడుదల చేస్తున్నారు. తమన్నా భాటియా, రాశీ ఖన్నా నటించారు..

పర్ఫెక్ట్‌ సమ్మర్‌ ట్రీట్‌

సక్సె్‌సఫుల్‌ హార్రర్‌ కామెడీ సిరీస్‌ ‘అరణ్మనై’లో నాలుగో భాగంగా వస్తున్న చిత్రం ‘అరణ్మనై 4’. తెలుగులో ఈ చిత్రాన్ని ‘బాక్‌’ పేరుతో విడుదల చేస్తున్నారు. తమన్నా భాటియా, రాశీ ఖన్నా నటించారు. సుందర్‌.సి స్వీయ దర్శకత్వం వహించారు. ఖుష్బు సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌కుమార్‌ నిర్మించారు. మే 3న ఈ చిత్రం తెలుగులో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ వేడుకలో నిర్మాత ఖుష్బు సుందర్‌ మాట్లాడుతూ ‘‘అస్సామీ జానపదంలో బాక్‌ అనే దెయ్యం ఉండేదని డైరెక్టర్‌ స్ర్కిప్ట్‌ రీసెర్చ్‌లో తెలుసుకున్నారు. అసలు ఈ బాక్‌ కథ ఏమిటి, తను ఏం చేస్తుందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’’ అని చెప్పారు. హీరోయిన్‌ తమన్నా మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం కొత్త అనుభూతిని ఇస్తుంది. తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. హీరోయిన్‌ రాశి ఖన్నా మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ చేయని ఓ కొత్త పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నాను. ఇందులో హారర్‌, థ్రిల్‌, కామెడీ అన్నీ ఉన్నాయి. ‘బాక్‌’ పర్ఫెక్ట్‌ సమ్మర్‌ ట్రీట్‌’’ అని అన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 06:35 AM